AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సామాన్యుడిలా స్టార్ హీరో.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

స్టార్ హీరోలను చూడటానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ మన హీరోలు బయట పెద్దగా కనిపించరు. దాంతో ఆ హీరోలు ఎప్పుడైనా బయటకు వస్తే ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరో విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దర్శనమించాడు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సామాన్యుడిలా స్టార్ హీరో.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
Tollywood Hero
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 11:12 AM

Share

సినిమా హీరోలు బయట కనిపించడం చాలా అరుదు. ఏదైనా సినిమా ఫంక్షన్స్, లేదా తమ సినిమా ప్రమోషన్స్ లోనూ బయట కనిపిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు సాధన గా బయటకు వచ్చి అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ శాతం హీరోలు తమ కొత్త కార్ల రిజిస్టేషన్స్ కోసం బయటకు వాస్తు ఉంటారు. సామాన్యుల్లా రిజిస్ట్రార్ కార్యాలయంకు వెళ్లి తన కారు ను రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్శనమిచ్చాడు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఆయన టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్. విశాఖలో సినీ నటుడు గోపీచంద్ ప్రత్యక్షమయ్యారు. సినిమా షూటింగ్ కోసం.. వచ్చారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన వచ్చింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి. వ్యక్తిగత పని కోసం వచ్చిన ఆయన.. షీలా నగర్లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ కాసేపు కూర్చొని అధికారులతో మాట్లాడారు. గోపీచంద్ వచ్చాడన్న విషయం తెలుసుకున్న.. వారంతా అక్కడికి చేరుకుని సెల్ఫీల కోసం సిద్ధమయ్యారు. అక్కడ సిబ్బంది కూడా గోపీచంద్ తో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపారు.

విశాఖ జిల్లా షీలా నగర్లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గోపిచంద్ వచ్చారు. మింది సమీపంలో ఉన్న తన స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వేరొకరితో ఒప్పందం కుదుర్చుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు గోపిచంద్. అక్కడ నుంచి తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.

అయితే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సకాలంలో వేగంగా పూర్తవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు గోపిచంద్. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నామని.. పది నిమిషాల్లోనే బయోమెట్రిక్ సహా వేగంగా పని పూర్తయిందన్నారు. అంతకు ముందు సబ్ రిజిస్ట్రార్ తారకేసు.. సిబ్బంది గోపీచంద్ కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపీచంద్ ను చూసేందుకు పోటీపడ్డారు జనం. కార్యాలయానికి వచ్చిన వాళ్ళు ఉత్సాహంగా ఆయనతో ఫొటోలు దిగారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది కూడా గోపీచంద్ తో కలిసి ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర