
70వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం రోజున ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర అవార్డులను అందజేస్తుంది. ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, సంగీత స్వరకర్త, సినిమాటోగ్రాఫర్‌తో సహా వివిధ అవార్డులు ఉత్తమ స్క్రీన్ ఆర్టిస్టులకు అందిస్తారు. ఈసారి 2022 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించగా, తమిళ చిత్రం ‘తిరుచిత్రంబలం’ తెలుగులో (తిరు) సినిమా 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. తిరు నటనకుగాను నటి నిత్యా మీనన్‌కు ఉత్తమ నటి అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ తన X (ట్విట్టర్ )లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్‌లాల్ నెహ్రూ దర్శకత్వం వహించిన తిరుచిత్రంబలం 2022లో థియేటర్లలో విడుదలైంది. ఇందులో ధనుష్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, భారతీరాజా, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమా 2022 ఏడాదిలో విడుదలైన అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తిరు బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ మూవీలో పాటలు పెద్ద హిట్ అయ్యాయి.
ఇకతిరు సినిమాలో నటించిన నిత్యా మీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలోని ‘మేఘం కురిసిన పిల్లో పిల్ల పాటకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్, సతీష్‌లకు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు దక్కింది. కాగా ధనుష్ తన X (ట్విట్టర్ ) ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. ఇందులో నిత్యా మీనన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం తన వ్యక్తిగత విజయమని ధనుష్ పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రానికి కొరియోగ్రఫీ చేసి జాతీయ అవార్డు గెలుచుకున్న జానీ, సతీష్ మాస్టర్‌లను ధనుష్ అభినందించారు.
Congratulations team thiruchitrambalam. It’s a personal win for me that @MenenNithya as shobana has won the national award. Big congrats to Jaani master and Satish master. It’s a great day for the team.
— Dhanush (@dhanushkraja) August 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..