Venkatesh: వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు దూరం..? కారణం ఇదేనా

|

Nov 14, 2022 | 8:02 AM

సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేస్తున్నారు వెంకీ. ఈ మధ్య కాలంలో దృశ్యం2, నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు వెంకటేష్.

Venkatesh: వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు దూరం..? కారణం ఇదేనా
Venkatesh
Follow us on

కుర్ర హీరోలతో పోటీపడుతున్న సీనియర్ హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ గురించి. తనదైన కామెడీ టైమింగ్ తో నటన తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు వెంకీ. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేస్తున్నారు వెంకీ. ఈ మధ్య కాలంలో దృశ్యం2, నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు వెంకటేష్. ఇక రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరిదేవుడా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు వెంకీ. అలాగే రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సిరీస్  ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకటేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వెంకటేష్ కొద్దిరోజుల పాటు సినిమాల కు దూరంగా ఉండనున్నారని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని కొన్ని రోజులు ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్ కు దైవ భక్తి ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆయన ఆ కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆధ్యాత్మిక సాధన చేయనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు గత కొన్ని రోజులుగాఆయన ఏ కొత్త ప్రాజెక్ట్‌కీ సైన్ చేయలేదని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి