Ashwin Babu: బిగ్ బాస్ ఇంట్లోకి రాజుగారి గది హీరో ఎంట్రీ… నిజమేనా..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని పలు భాషల్లో ఈ షో విజయవంతంగా సాగుతుంది.

Ashwin Babu: బిగ్ బాస్ ఇంట్లోకి రాజుగారి గది హీరో ఎంట్రీ... నిజమేనా..?
Ashwin Babu

Edited By:

Updated on: Jul 19, 2021 | 6:19 AM

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని పలు భాషల్లో ఈ షో విజయవంతంగా సాగుతుంది. అలాగే తెలుగులో కూడా బిగ్ బాస్ భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఇప్పటికే నాలుగు సీజన్స్ ను పూర్తిచేసుకొని త్వరలో ఐదో సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ లో తారక్ తన మాటలతో ఆటలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఆతర్వాత సీజన్ 2కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సీజన్ 3,సీజన్ 4 లకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా సీజన్ 5 ఎప్పుడు మొదలవుతుందా..? ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ 5లో పాల్గొనేది వీరే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో హీరో పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఆహీరో ఎవరో అశ్విన్. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ సోదరుడే ఈ అశ్విన్ బాబు. ఇప్పుడు ఈ యంగ్ హీరో  ‘బిగ్ బాస్ 5’ లో అడుగుపెట్టనున్నాడట. అశ్విన్.. ‘జీనియస్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘రాజు గారి గది’ ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ ‘రాజు గారి గది 2’ ‘రాజు గారి గది 3’ వంటి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అశ్విన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడో లేదో చూడాలి. ఇక ‘బిగ్ బాస్ 5’ ను సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని ‘స్టార్ మా’ వారు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్

Kamal Haasan : షూటింగ్ రీ స్టార్ట్ చేసిన విశ్వనటుడు.. విలన్ గా మక్కల్ సెల్వన్..