Nagarjuna Akkineni: కొత్త కారు కొన్న కింగ్ నాగార్జున.. రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
ఇద్దరు కొడుకులు హీరోగా రాణిస్తున్నప్పటికీ నాగ్ ఏమాత్రం తన ఫిట్ నెస్ తో యంగ్ గా కనిపిస్తూ అందరిని అవాక్ చేస్తున్నారు. ఇక నాగ్ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

63 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ యంగ్ హీరోలకే సవాలు విసురుతున్నాడు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇద్దరు కొడుకులు హీరోగా రాణిస్తున్నప్పటికీ నాగ్ ఏమాత్రం తన ఫిట్ నెస్ తో యంగ్ గా కనిపిస్తూ అందరిని అవాక్ చేస్తున్నారు. ఇక నాగ్ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా హుందాగా.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక నాగ్ గ్యారేజ్ లో చాలా రకాల కార్లు ఉన్న విషయం తెలిసిందే. అటు నాగ చైతన్యకు కూడా కార్లు అంటే చాలా ఇష్టం ఆయన ఎన్నో రకాల కార్లు కొన్నారు.
తాజాగా కింగ్ నాగార్జున ఓ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశాడు. కియా ఈవీ 6 కారును ఇంటికి తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కొత్త కారును కేవలం నాలుగన్నర నిమిషాలు మాత్రమే చార్జింగ్ పెడితే 100 కిలో మీటర్ల దూరం వెళ్లొచ్చట. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే ఇది 60 నుంచి 70లక్షల వరకు మేర ఉంటుంది.
ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు నాగ్.