రష్మిక మందన్నా పూర్తి పేరు ఏంటో తెలుసా.. ? అసలు ఊహించలేరుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
గత మూడేళ్లలో మూడు భారీ విజయాలను అందుకుంది. ఆమె నటించిన యానిమల్, పుష్ప, ఛావా చిత్రాలు వరుసగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
దీంతో ఇప్పుడు రష్మిక పేరు మారుమోగుతుంది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ సత్తా చాటుతుంది. కానీ రష్మిక అసలు పేరెంటో మీకు తెలుసా.
ఇటీవల ఛావా సినిమా ఈవెంట్లలో రష్మిక తన అసలు పేరును ప్రస్తావించింది. ఆమె అసలు పేరు ఎం రష్మిక మందన్న. అంటే ముందచాదిర్ రష్మిక మందన్నా.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఛావా సినిమా సత్తా చాటుతుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
కిరిక్ పార్టీ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన రష్మిక.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.
సికందర్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, థామ చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ ఈ బ్యూటీ.