03 March 2025

4 ఏళ్లుగా ఒక్క సినిమాలో నటించలేదు.. ఆస్తులు రూ.650 కోట్లు.. ఇప్పుడు..

Rajitha Chanti

Pic credit - Instagram

ఆమె మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన అందాల తార. తమిళ సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. 

ఆమె ఆస్తులు రూ.650 కోట్లు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ వరుస హిట్స్ అందుకుంటూ సత్తా చాటింది. గత 4 ఏళ్లుగా ఒక్క సినిమాలో నటించలేదు. 

ఆమె మరెవరో కాదు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో హిట్ చిత్రాలతో అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేసింది. 

ప్రస్తుతం ఆమె తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ చోప్రాతో కలిసి లాస్ ఏంజిల్స్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వరుస సినిమాలు చేస్తుంది. 

2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత 2002లో విజయ్ దళపతి సరసన నటించి కథానాయికగా తన సినీప్రయాణం స్టార్ట్ చేసింది. 

2003లో ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో సన్నీ డియోల్, ప్రితీ జింటా కీలకపాత్రలలో నటించారు. 

పెళ్లి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో నెమ్మదిగా సినిమాలు తగ్గించేసింది. హిందీలో చివరిసారిగా 2021లో ది వైట్ టైగర్ చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఆమె ఆస్తులు రూ.650 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది.