Yash: రావణుడి పాత్ర చేయడానికి.. అందుకే ఒప్పుకున్నా..
దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాముడిగా బీటౌన్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీతమ్మ పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ లీకయ్యాయి.
ఇక ఇందులో రావణుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. ఇటీవలే రామాయణ సెట్స్ లో అడుగుపెట్టాడు యష్. తాజాగా ఈ చిత్రంలో రావణుడి పాత్రను ఎందుకు ఎంచుకున్నాడో వెల్లడించారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. రావణుడి క్యారెక్టర్‌ను ఎందుకు ఎంచుకున్నాడనేది చెప్పాడు. రామాయణంలో వేరే ఏదైనా పాత్ర పోషించడానికి తాను ఇష్టపడతానా ఇష్టపడతానో లేదో అనేది పక్కకు పెడితే.. రావణుడిగా నటించడానికి తనకు చాలా స్కోప్ ఉంటుదన్నాడు. ఈ ప్రత్యేక పాత్ర ప్లే చేయడానికి తనకు ఎదురయ్యే సవాళ్లు ఇష్టం. ఈ పాత్రను విభిన్నంగా ప్రజెంట్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు యశ్. అంతకు ముందు మరో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. లాస్ ఏంజిల్స్‌లో టాక్సిక్ చిత్రానికి VFX పని చేస్తున్నప్పుడు, ప్రైమ్ ఫోకస్‌కు చెందిన నమిత్ మల్హోత్రా తనను సంప్రదించారని ఆయన వెల్లడించారు. అదే సమయంలో నమిత్ తనకు రామాయణ సినిమా గురించి చెప్పారని అన్నారు. దీంతో రామాయణ సినిమాపై తాను ఒక అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో రావణుడి పాత్రను, ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం , నటించడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా ఛాన్సులు లేక.. నెల జీతం కోసం హీరోయిన్ ఉద్యోగం
అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్
సైబర్ నేరగాళ్ల బారిన పడకండి.. ఫోన్ వాయిస్ అమ్మాయి ఎవరంటే
తమ్ముడిపై అన్న సెటైర్! సైలెంట్‌గా ఇచ్చిపడేశాడుగా
క్రిప్టో కరెన్సీ మోసం, పోలీస్ కేస్! రియాక్టైన స్టార్ హీరోయిన్ !
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

