Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ! మళ్లోసారి కాటేరమ్మ పూనడం పక్కా..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు డార్లింగ్. గతేడాది కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్, డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.
మరికొన్ని రోజుల్లో స్పిరిట్ ప్రాజెక్ట్ సైతం పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సినిమాను అడియన్స్ ముందుకు మళ్లీ తీసుకురానున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత సూపర్ హిట్ అయ్యింది. కేజీఎఫ్ 1, 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈసినిమాకు ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఈ క్రమంలో తాజాగా సలార్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 21న ఈ సినిమాను మరోసారి వెండితెరపై ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ భార్య సైతం ఈ రీరిలీజ్ గురించి పోస్ట్ చేసింది. ఆమె కూడా ఈ సినిమా రీరిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరోసారి రెబల్ ఫ్యాన్స్ సలార్ చిత్రాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేయనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: రావణుడి పాత్ర చేయడానికి.. అందుకే ఒప్పుకున్నా..
సినిమా ఛాన్సులు లేక.. నెల జీతం కోసం హీరోయిన్ ఉద్యోగం
అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
