సినిమా ఛాన్సులు లేక.. నెల జీతం కోసం హీరోయిన్ ఉద్యోగం
సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. స్టార్ హీరోయిన్స్ గా ఎదగాలని కోరికతో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు.
కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్ గా మారి.. ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లలో దీక్షా సేత్ ఒకరు. అయితే ఆమె ఇప్పుడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. రెబల్ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్.. వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు ఈ అమ్మాయిని. ఈ ఇద్దరి స్టార్ హీరోల పక్కన చేసి అప్పట్లో పాపుల్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ.. హిట్స్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. చివరగా తెలుగులో 2012లో వచ్చిన ఊ కొడతార.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తెలుగు, హిందీలోనే కాకుండా.. కన్నడ హీరో దర్శన్ జోడిగా జగ్గూబాయ్ సినిమాలో నటించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో లండన్ వెళ్లిపోయింది దీక్షా. ప్రస్తుతం అక్కడే ఐటీ జాబ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్
సైబర్ నేరగాళ్ల బారిన పడకండి.. ఫోన్ వాయిస్ అమ్మాయి ఎవరంటే
తమ్ముడిపై అన్న సెటైర్! సైలెంట్‌గా ఇచ్చిపడేశాడుగా
క్రిప్టో కరెన్సీ మోసం, పోలీస్ కేస్! రియాక్టైన స్టార్ హీరోయిన్ !

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
