Madhubala: రోజా మూవీ బ్యూటీ మధుబాల కుమార్తెలను చూశారా..? అందానికే అసూయ కలుగుతుందేమో..!

రోజా సినిమా చూడని వాళ్లు ఉండరు. అందులో మధుభాల పాత్రను ఇష్టపడని వారు ఉండరు. ఎంతో అమాయకమైన పాత్రలో ఆ సినిమాలో నటించి.. ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది ఈ నటి. అప్పట్లో మధుబాల అంటే కుర్రాళ్లు వెర్రెక్కిపోయేవారు.

Madhubala: రోజా మూవీ బ్యూటీ మధుబాల కుమార్తెలను చూశారా..? అందానికే అసూయ కలుగుతుందేమో..!
Madhubala
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2023 | 1:48 PM

మధుబాల 90వ దశకంలో పాపులర్ నటి. 1991లో కె బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్‌తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మధు.. మణిరత్నం తీసిన రోజా సినిమాలో తన అద్భుతమైన నటన, కళ్లు తిప్పుకోనివ్వని అందంతో అందర్నీ ఇంప్రెస్ చేసింది. హిందీ , తమిళం , తెలుగు , మలయాళం,  కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేసింది. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, చిలక్కొట్టుడు, గణష్ చిత్రాల్లో మెరిసింది ఈ భామ. తమిళనాడుకు చెందిన  మధుబాలకు అప్పట్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ప్రముఖ నటిమణులు హేమా మాలిని,  జుహీ చావ్లాలకు బంధువైన  ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న వివాహం చేసుకుంది మధుబాల.  వీరికి అమెయా, కెయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వివాహానంతరం కెరీర్‌లో స్వల్ప విరామం తీసుకున్న మధుబాల.. సెకండ్ ఇన్సింగ్స్‌లో  తల్లి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మధు-ఆనంద్ షా కుమార్తెలు కూడా ఎంతో అందంగా ఉన్నారు. మధుభాల ఎప్పుడైనా తన కుమార్తెలు ఫోటోలను నెట్టింట షేర్ చేస్తే… వెంటనే అవి వైరల్ అవుతాయి. నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తారు. థ్యాంక్స్ క్వీన్.. ఈ జనరేషన్‌కు ఇద్దరు హీరోయిన్లను ఇచ్చావ్ అని కామెంట్స్ పెడతారు. మరీ అమెయా, కెయాలకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ ఉందా..? వారు ఇండస్ట్రీకి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Madhoo

Madhoo with Daughters

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.