Guntur Kaaram: మహేష్ సినిమా కోసం ఆ మ్యూజిక్ డైరెక్టర్.. తమన్ ప్లేస్‌లో అతడేనా..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. గుంటూరు కారం సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్ గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తూ ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. గుంటూరు కారం సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్ గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. దాంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు.
ఇప్పుడు చూస్తుంటే రిలీజ్ మరింత లెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమానుంచి పూజా తప్పుకుంది. దాంతో సెకండ్ హీరోయిన్ గా అనుకున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా తప్పుకున్నారని టాక్ వినిపిస్తుంది. గుంటూరు కారం సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారని అనౌన్స్ చేశారు. కానీ తమన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని అంటున్నారు. ఆయన ప్లేస్ లో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అబ్దుల్ వాహిబ్‌ను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే భీమ్స్ సిసిరోలియో పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గుంటూరు కారం నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ మాస్ బీట్ తో ఉంటుందని టాక్.