Happy Birthday Mahesh Babu: మహేష్‌కు చిరు బర్త్ డే విషెస్.. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం అంటూ..  

|

Aug 09, 2022 | 2:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు.. దాంతో సినిమా తారలు, పలువురు ప్రముఖులు మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

Happy Birthday Mahesh Babu: మహేష్‌కు చిరు బర్త్ డే విషెస్.. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం అంటూ..  
Mahesh Babu, Chiranjeevi
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) పుట్టిన రోజు నేడు.. దాంతో సినిమా తారలు, పలువురు ప్రముఖులు మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. మహేష్ కు అందరు హీరోలతో మంచి సన్నిహిత సంబంధం ఉంది. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సూపర్ స్టార్ ఇక ఇటీవల కాలంలో మహేష్ చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ మహేష్ కు విషెస్ తెలిపారు. మెగాస్టార్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

మెగాస్టార్ తో పాటు హీరో వెంకటేష్ కూడా మహేష్ కు విషెస్ తెలిపారు.. హ్యాపీ బర్త్ డే చిన్నోడా అని వెంకీ రాసుకొచ్చారు. అలాగే  వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ ఇలా చాలా మంది మహేష్ కు విషెస్ తెలుపుతున్నారు. ఇక ఫ్యాన్ హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్నారు ఫ్యాన్స్.. మహేష్ బర్త్ డే ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో నెంబర్ 1 లో ఉంది. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి , ఒక్కడు సినిమాలను స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. వీటికి ట్రెమండర్స్ రెస్పాన్స్ వస్తోంది. కొత్త సినిమా రిలీజ్ ను తలపిస్తుంది థియటర్స్ దగ్గర వాతావరణం.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో, రాజమౌళితో సినిమాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి