G. V. Prakash Kumar: సౌత్ టు నార్త్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో సెల్ఫీ దిగిన యంగ్ టాలెంటెడ్

సౌత్ లో రోజు రోజుకు బాలీవుడ్ మీద మోజు పెరిగిపోతుందో. ఇప్పటికే సౌత్ నుంచి హీరోయిన్స్ చాలా మంది బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే.

G. V. Prakash Kumar: సౌత్ టు నార్త్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో సెల్ఫీ దిగిన యంగ్ టాలెంటెడ్
Gv Prakash
Follow us

|

Updated on: Jun 26, 2022 | 7:53 PM

సౌత్ లో రోజు రోజుకు బాలీవుడ్ మీద మోజు పెరిగిపోతుందో. ఇప్పటికే సౌత్ నుంచి హీరోయిన్స్ చాలా మంది బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. అలాగే హీరోలు కూడా హిందీ సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు. కోలీవుడ్ నుంచి ధనుష్ లాంటి హీరోలు బాలీవుడ్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో టాలెంటెడ్ హీరో కూడా హిందీలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో సౌత్ స్టార్స్ కు మరియు టెక్నీషియన్స్ కు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మల్టీ టాలెంటెడ్ జీవి ప్రకాష్(G. V. Prakash Kumar) కూడా బాలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇప్పటికే హీరోగా మారిన విషయం తెల్సిందే. ఆయన ఇటు వరుసగా హీరోగా, అటు సంగీత దర్శకుడిగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ హిందీలో సినిమా చేయనున్నాడు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవి ప్రకాష్ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కంగనా తో వర్క్ చేయబోతున్నట్లుగా ప్రకటించిన జీవీ ప్రకాష్ కంగనాతో కలిసి సినిమాలో నటిస్తున్నాడా లేదంటే ఆమె సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడా అంటూ పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొత్తానికి మరో సౌత్ హీరో కూడా బాలీవుడ్ లోకి అడుగు పెట్టేశాడు.

Kangana, Gv Prakash

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి