Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingston Review: జివి. ప్రకాష్ కింగ్ స్టన్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

ఓవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతూ.. ఇంకోవైపు నటుడిగానూ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జి.వి.ప్రకాష్ కుమార్. అలాంటి ఈయన.. తాజాగా 'కింగ్ స్టన్' సినిమాతో మన ముందుకు వచ్చారు. ఫస్ట్ సీ హర్రర్ సినిమా ఇదే అంటున్నారు. హైద్రాబాద్‌కు వచ్చి మరీ తన సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి ఈసినిమా ఎలా ఉందో.. ఈ రివ్యూలో చూద్దాం..!

Kingston Review: జివి. ప్రకాష్ కింగ్ స్టన్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Kingston
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 07, 2025 | 7:59 PM

మూవీ : కింగ్ స్టన్
నటులు: జీవీ ప్రకాష్,దివ్య భారతి,సబూ మన్

దర్శకుడు: కమల్ ప్రకాష్

ఓవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతూ.. ఇంకోవైపు నటుడిగానూ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జి.వి.ప్రకాష్ కుమార్. అలాంటి ఈయన.. తాజాగా ‘కింగ్ స్టన్’ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఫస్ట్ సీ హర్రర్ సినిమా ఇదే అంటున్నారు. హైద్రాబాద్‌కు వచ్చి మరీ తన సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి ఈసినిమా ఎలా ఉందో.. ఈ రివ్యూలో చూద్దాం..!

 కథ :

ఇక కింగ్ స్టన్ కథలోకి వెళితే.. కింగ్ స్టన్ అలియాస్ జి.వి.ప్రకాష్ కుమార్ ఆంటోని అలియాస్ సబూమన్ స్మగ్లింగ్ గ్యాంగులో పని చేసే కుర్రాడు. తప్పుడు మార్గంలో అయినా సరే.. డబ్బులు సంపాదించి ఒక బోటు కొనుక్కోవాలన్నది అతడి లక్ష్యం. ఐతే ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ ను నడిపించే థామస్ తో ఒక సందర్భంలో కింగ్ గొడవ పడతాడు. దీంతో తనతో పాటు ఊరి మొత్తానికి పని పోతుంది. ఐతే ఆ ఊరి వాళ్లకు ఉపాధి ఉండదు. ఆ ఊరి నుంచి ఎవరైనా చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్తే శవమై తిరిగొస్తారనే శాపం ఉంటుంది. ఈ శాపం వెనుక రహస్యాన్ని ఛేదించి ఊరికి ఉపాధి కల్పించాలని కింగ్ పంతం పడతాడు. ఓ మిత్ర బృందాన్ని వెంటేసుకుని బోటులో సముద్రంలోకి బయల్దేరతాడు. మరి కింగ్-తన మిత్రులు సముద్రంలోకి వెళ్లి క్షేమంగా బయటికి రాగలిగారా.. ఇంతకీ ఆ శాపం వెనుక కథేంటి.. కింగ్ అనుకున్నది సాధించాడా.. తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే

కథనం :

సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో.. ఈ పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాతే అసలు సమస్య వచ్చింది. పాయింట్ బాగానే ఉందనిపిస్తుంది.. కానీ దానికి తగ్గ సెటప్, ఎమోషన్స్ మాత్రం ఎక్కడా కనిపించవు. అప్పటి వరకు ఆంటోని అలియాస్ సబూమన్ చెడ్డ వాడు అని హీరో తెలుసుకోలేకపోవడం ఏంటి? ఆంటోని దగ్గర పని చేస్తూ.. డబ్బులు నొక్కేసే హీరో ఒక్కసారిగా మారిపోవడం ఏంటి? విలన్‌కు ధమ్కీ ఇవ్వడం ఏంటి? అప్పటి వరకు ఆ విలన్ అంటే అందరికీ భయం అనేలా చూపిస్తాడు? కానీ హీరో మాత్రం అవలీలగా ఎదురించేస్తాడేంటి? అని ఇలా లాజిక్స్ వెతికితే మాత్రం కష్టమే. అలా అని లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సినిమాను చూద్దామంటే.. అక్కడ ఎంగేజింగ్ సీన్లు కానీ, ఆడియెన్స్‌ను కట్టి పడేసే ఎమోషన్స్ కానీ ఏవీ ఉండవు.

సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు ఇదొక అరవ సినిమా.. తమిళ డబ్బింగ్ సినిమా అని పదే పదే గుర్తుకు వస్తుంటుంది. డబ్బింగ్ విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. హీరోకి మాస్ ఎలివేషన్స్.. హీరో ఎంట్రీ సాంగ్.. ఇలా అన్నీ లెక్కేసుకుని తీశారు. కానీ అసలు ఎమోషన్ కనెక్ట్ అవుతోందా? ఆడియెన్స్‌కు నచ్చుతుందా? అని మాత్రం ఆలోచించలేదు. హీరో, హీరోయిన్ మధ్య కూడా ట్రాక్, ఆ ప్రేమ కూడా కృతకంగానే అనిపిస్తుంది. అసలు ఊర్లో అమ్మాయిలు మిస్ అవుతున్నారనే పాయింట్‌ను ఆడియెన్స్‌కి ఎక్కించే ప్రయత్నం, ఓ సెటప్ కానీ ఏర్పాటు చేయలేదు.

సముద్రంలోకి వెళ్లేందుకు హీరో ఫిక్స్ అవ్వడంతో ప్రథమార్దం ముగుస్తుంది. ఇక సెకాండాఫ్ మొత్తం అడ్వంచరస్‌గా ఉంటుందని అందరికీ అర్థమైపోతుంది. ఒకే పడవ.. నాలుగైదు కారెక్టర్లు.. మధ్యలో వచ్చే వింత జీవులు. అవి దెయ్యాలా? అంటే ఏమో అనే ఆన్సర్ మాత్రం వస్తుంది. చివరకు అది ఒకరి ఆత్మ అని అర్థం అవుతుంది. అసలు అక్కడి సీన్లు ఏవీ కూడా అంతగా ఎక్కవు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లక సంబంధించి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగానే ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!