Guess The Actor: మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతోన్నఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా? అతని ఎంట్రీనే ఓ సెన్సేషన్‌

|

Feb 24, 2023 | 6:15 AM

పై ఫొటోలో ఉన్న హీరో కూడా గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టినవారే. బడా సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఉంది. డబ్బు, పలుకుబడి, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ సినిమాల మీద మక్కువతో అతను కష్టపడి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు.

Guess The Actor: మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతోన్నఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా? అతని ఎంట్రీనే ఓ సెన్సేషన్‌
Martial Arts
Follow us on

మన స్టార్‌ హీరోల్లో  చాలామంది ఇండస్ట్రీలోకి రాక ముందు నటనలో శిక్షణ తీసుకున్నవారే. సినిమా ఫ్యామిలీస్‌ నుంచి వచ్చి స్టార్‌కిడ్స్‌గా చెలామణి అయినప్పటికీ యాక్టింగ్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడ్డవారే. అందుకోసం యాక్టింగే కాకుండా మార్ట్సల్‌ ఆర్ట్స్‌లోనూ ట్రైనింగ్‌ తీసుకున్నారు. కరాటే బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ వంటివి నేర్చుకుని మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పై ఫొటోలో ఉన్న హీరో కూడా గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టినవారే. బడా సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఉంది. డబ్బు, పలుకుబడి, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ సినిమాల మీద మక్కువతో అతను కష్టపడి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు. ఇక టాలీవుడ్‌కు పరిచయమవుతూనే ఓ వరల్డ్‌ రికార్డును సెట్‌ చేశారీ ట్యాలెంటెడ్ హీరో. ఒకే రోజు తొమ్మిది సినిమాలకు సైన్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ స్టార్‌ హీరోకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇలా ఎంట్రీతోనే సంచలనాలు సృష్టించిన ఆయన మరెవరో కాదు.. నందమూరి తారకరామారావు మనవడు నందమూరి తారకరత్న. ఇటీవలే ఆయన గుండెపోటుతో మరణించారు. ఈక్రమంలో తారకరత్న చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే పై ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలో తారకరత్నకు మార్షల్ ఆర్ట్స్ నేర్పింది ఎవరో తెలుసా? ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ విజయ్ శేఖర్. తారకరత్న మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం తెలియజేశారు.

ఇక ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఆతర్వాత తారక్‌, యువరత్న, నో, భద్రాద్రిరాముడు, వెంకటాద్రి, అమరావతి, ముక్కంటి, నందీశ్వరుడు, మహాభక్తి శిరియాళ, కాకతీయుడు, రాజా చెయ్యి వేస్తే, దేవినేని తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు. కేవలం హీరోగానే కాకుండా అమరావతి సినిమాల్లో విలన్‌గా అదరగొట్టారు. ఈ సినిమాలో తారకరత్న నటనకు నంది అవార్డు దక్కింది. సినిమాలే కాకుండా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ తన యాక్టింగ్‌ ట్యాలెంట్‌నూ చూపించారు. ఇలా నటుడిగా అభిమానులను అలరించిన తారకరత్న రాజకీయాల్లో కూడా రాణించాలనుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని భావించారు. అయితే ఆయనొకటి తలిస్తే విధి ఇంకొకటి తలచింది. నారా లోకేశ్‌ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాణించాలని అనుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.

 

ఇవి కూడా చదవండి

Nandamuri Taraka Ratna

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..