Tollywood: నిబ్బా అనుకునేరు! ఇప్పుడు టాలీవుడ్ సంచలనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు.. ఎవరో గుర్తు పట్టారా?

ఇతను 2014లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. మొదటి రెండు సినిమాలు బాగానే ఆడాయి. ఆడియెన్స్ మెప్పు పొందాయి. ఇక చివరి రెండు సినిమాలు అయితే బ్లాక్ బస్టర్స్. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఏకంగా రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నాడీ టాలీవుడ్ సంచలనం

Tollywood: నిబ్బా అనుకునేరు! ఇప్పుడు టాలీవుడ్ సంచలనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director

Updated on: Oct 12, 2025 | 4:16 PM

పై ఫొటోలో నిబ్బాను గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. అలాగనీ అతను స్టార్ హీరో ఏమీ కాదు. స్టార్ దర్శకుడు, ప్రొడ్యూసర్ కూడా కాదు. 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ 11 ఏళ్ల కాలంలో కేవలం నాలుగంటే నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. మొదటి రెండు సినిమాలు పక్కా కామెడీ ఎంటర్ టైనర్స్. థియేటర్లలో కూడా ఈ సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఎందుకోగానీ ఇతను పెద్దగా జనాల్లో రిజిష్టర్ అవ్వలేకపోయాడు. తగిన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. కానీ.. కరోనా కాలంలో ఒక సినిమా చేశాడు. థియేటర్ల రిలీజ్ కు సమస్యలు రావడంతో డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ చేశాడు. కానీ సినిమా బ్లాక్ బస్టర్.. ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. దీని తర్వాత సరిగ్గా రెండేళ్ల క్రితం మరో సినిమా తీశాడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కావడంతో ఆడియెన్స్ ఎగబడి చూశారు. ముఖ్యంగా యూత్ అయితే ఈ మూవీ చూసి తెగ ఫీలయిపోయారు. కొందరైతే థియేటర్లలోనే ఏడ్చేశారు కూడా! సినిమా కూడా 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో పాటు అదనంగా మరో జాతీయ అవార్డు వచ్చి చేరింది.

ఇలా రైటర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా బ్యాక్ టు బ్యాక్ జాతీయ అవార్డులు అందుకున్న ఆ సంచలనం మరెవరో కాదు సాయి రాజేష్.. ఇలా పేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ బేబీ సినిమా డైరెక్టర్ అంటే ఇట్టే గుర్తు పడతారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతను తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశాడు. టీనేజ్ నాటి త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేసి ‘ నిబ్బా మీ’ (#NibbaMe) అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాయి రాజేష్ షేర్ చేసిన ఫొటో..

కాగా కెరీర్ ప్రారంభంలో సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి   ‘హృదయ కాలేయం’ తీశాడు సాయి రాజేష్. ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత మరోసారి  సంపూర్ణేశ్ బాబుతో ‘కొబ్బరిమట్ట’ అనే చిత్రం తీశాడు. ఇక ‘కలర్ ఫొటో’  సినిమాకు స్టోరీ అందించిన సాయి రాజేశ్.. నిర్మాతగానూ వ్యవహరించాడు.  దీనికి నేషనల్ అవార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మొదటి సారిగా మెగా ఫోన్ పట్టి తీసిన  ‘బేబి’కి సినిమాకు కూడా జాతీయ  అవార్డ్  గెల్చుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులు అందుకుంటూ..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.