సీరియల్‌లో సింపుల్‌గా.. బయట మాత్రం సెగలు రేపుతూ..

|

Sep 17, 2024 | 7:15 AM

తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు సీజన్ 8తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఆశించిన స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకోలేకపోతోంది. పెద్దగా తెలిసిన మొఖాలు లేకపోవడమతొ అంతగా ప్రేక్షకులు ఆసక్తి చూపించడంలేదు.

సీరియల్‌లో సింపుల్‌గా.. బయట మాత్రం సెగలు రేపుతూ..
Tollywood
Follow us on

తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన షోల్లో బిగ్ బాస్ షో మొదటి స్థానంలో ఉంటుంది. చాలా భాషల్లో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు సీజన్ 8తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఆశించిన స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకోలేకపోతోంది. పెద్దగా తెలిసిన మొఖాలు లేకపోవడమతొ అంతగా ప్రేక్షకులు ఆసక్తి చూపించడంలేదు. ఇదిలా ఉంటే ఇక బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు కూడా అందుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు బిగ్ బాస్ ఫెమస్.. అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ అమ్మడు అలా కాదు.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమి కాదు ఆమెను గుర్తుపట్టడం. ఆమె ఎవరో కాదు హమీద. బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీదా..ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్ లో ఆమె పాత్ర మొదట్లో నెగిటివ్ రోల్ లో ఉన్నప్పటికీ ఈ మధ్య ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్ లోకి మార్చారు. ఈ క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సీరియల్స్ లో చాలా పద్దతిగా చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. సీరియల్స్ ను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడిని పద్దతిగా చూస్తూఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. ఇక ఈ అమ్మడు బర్త్ డే ఫోటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత ఈ అమ్మడు ఈ లుక్ లో మెరిసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ అందాల భామ ఎక్కువరోజులు లేదు కానీ ఉన్నన్ని రోజుల్లో తన ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి. అలాగే టాస్క్ ల్లోనూ హుషారుగా పాల్గొంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.