Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

సోషల్ మీడియాలో సినీతారల త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ కాలేజ్ డేస్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు స్కూల్లో టీచర్ గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత ఇండస్ట్రీని శాసించింది. తెలుగులో స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.

Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
Anushka Shetty

Updated on: Nov 07, 2025 | 10:32 AM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయంతెగ వైరలవుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. సినిమాల్లోకి రాకముందు హీరోయిన్స్ ఏం చేసేవారు ? అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రా ప్రజలకు ఇష్టమైన హీరోయిన్ ఆమె. పైన ఫోటోను చూశారా.. ? ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. తెలుగు సినిమా ప్రపంచంలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, రానా, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో విభిన్న కంటెంట్ చిత్రాలతో ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది.

ఒకప్పుడు చేతినిండా సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ.. ఒకప్పుడు స్కూల్లో యోగా టీచర్ గా పనిచేసిందని మీకు తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి హీరోయిన్ అనుష్క శెట్టి. దక్షిణాదిలో టాప్ హీరోయిన్. నాగార్జున, సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో జేజమ్మ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. చాలా కాలం తర్వాత ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ స్కూల్‌లో యోగా టీచర్ గా పనిచేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Anushka Shetty Throwback

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..