Tollywood: క్యూట్ క్యూట్‏గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు అందాల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి..

|

Mar 03, 2023 | 9:56 AM

తెలుగులో చేసింది రెండు చిత్రాలు మాత్రమే కానీ.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.కానీ ఆ తర్వాత అదృష్టం కలిసిరాక ఆనతి కాలంలోనే వెండితెరకు దూరమయ్యింది. కానీ ప్రస్తుతం తమిళంలో వరుస హిట్స్ అందుకుంటుంది. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: క్యూట్ క్యూట్‏గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు అందాల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

తెలుగు తెరపై అందం, అభినయంతో సినీ ప్రియులను మెప్పించిన కథానాయికలు అనేక మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే నటనపరంగా మార్కులు కొట్టేయడమే కాకుండా సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అందులో కొందరు వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్స్ కాగా.. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే ఫెడౌట్ అయిపోతుంటారు. ఇక మరికొందరు ముద్దుగుమ్మలు తమిళంతోపాటు.. కన్నడ, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటుంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగులో చేసింది రెండు చిత్రాలు మాత్రమే కానీ.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.కానీ ఆ తర్వాత అదృష్టం కలిసిరాక ఆనతి కాలంలోనే వెండితెరకు దూరమయ్యింది. కానీ ప్రస్తుతం తమిళంలో వరుస హిట్స్ అందుకుంటుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ అందాల రాక్షసి మరెవరో కూదా.. హీరోయిన్ రితికా సింగ్. 1994లో ముంబైలో జన్మించిన రితికా.. కేవలం కథానాయిక మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా. 2009లో భారతదేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది. 2012లో ఇరుదుచుట్రు అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

ఇవి కూడా చదవండి

విక్టరీ వెంకటేశ్ సరనస గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో రితికా నటనకు మంచి మార్కులే అందుకుంది. ఆ తర్వాత రాఘవా లారెన్స్ నటించిన శివలింగ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె ఇన్ కార్ అనే చిత్రంలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. అలాగే ప్రస్తుతం రితికా చేతిలో పిచ్చకారెన్‌ 2, వనంగ ముడి, కొలై, కింగ్‌ ఆఫ్‌ కొత అనే సినిమాలున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.