సినీరంగంలో నటిగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు తమ అందం, టాలెంట్ తో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సినిమాల్లో సక్సెస్ అయిన కొందరు తారలు ఇటు రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఆమె ఒకరు. ఒకప్పుడు టాప్ హీరోయిన్.. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. వెండితెరపై, బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన ఖాతాను కలిగి ఉంది. ఆమె మరెవరో కాదు.. స్మృతి ఇరానీ.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లోని మహిళా శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై మెరిసి అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ అంతకుముందు మోడలింగ్ రంగంలో చాలా యాక్టివ్ గా ఉండేది. అంతేకాదు 26 ఏళ్ల క్రితం మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మోడలింగ్ ఫోటోలు చూస్తే, మీరు ఆమెను స్మృతి ఇరానీగా గుర్తించలేరు.
స్మృతి ఇరానీ స్నేహితురాలు ఏక్తా కపూర్ తన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో 26 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ చేసిన ర్యాంప్ వాక్ ఈ వీడియోలో చూడొచ్చు. 1998లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకుంది స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.