Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది.

Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..
Shobana

Updated on: Sep 15, 2025 | 5:50 PM

మనం మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఇచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం సహయ నటీనటులుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ప్రస్తుతం ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భారతదేశం చూసిన గొప్ప నటి, మలయాళీ సినిమా ప్రపంచంలో తనదైన ముద్రవేసింది. కళ్లతోనే నటించగల అద్భుతమైన నటి. ఆ కళ్లను చూస్తే గుర్తుపట్టొచ్చు.. ఆమె శోభన. ఆమె ఇప్పుడు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ యమ క్రేజ్ ఉంది. ఆమె ప్రస్తుతం శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డ్యాన్స్ శిక్షణకు సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేస్తుంది. శోభన మార్చి 21న 1970న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. 1980లో శ్రీకాంత్, కెఆర్ విజయ నటించిన మంగళ నాయకి చిత్రంలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. మలయాళీ సినిమాల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. 1984లో నటుడు కమల్ హాసన్ కథానాయికగా కనిపించింది. అప్పట్లో కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

తెలుగు, హిందీ, కన్నడ భాషలలో 200కి పైగా చిత్రాలతో నటించారు. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తుంది శోభన. 2006లో సినీరంగంలో ఆమె చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు పద్మ భూషణ్ అవార్డ్ అందుకుంది. ఇటీవలే మోహన్ లాల్ జోడిగా తుడురమ్ చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..