Guess This Actress : కురులతో అందాన్ని దాచేసింది.. ఆ నవ్వుతోనే హృదయాలను దొచేస్తోంది.. ఎవరీ ముద్దుగుమ్మ గుర్తుపట్టండి..

|

Feb 25, 2023 | 7:00 PM

అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైంది. గుర్తుపట్టండి. ఆమె అందం ముందు జాబిలమ్మ సైతం చిన్నబోతుందేమో. కాటుక దిద్దిన ఆ నయనాలకు కుర్రాళ్ల గుండెలు బేజారు కావాల్సిందే. గుర్తుపట్టండి.

Guess This Actress : కురులతో అందాన్ని దాచేసింది.. ఆ నవ్వుతోనే హృదయాలను దొచేస్తోంది.. ఎవరీ ముద్దుగుమ్మ గుర్తుపట్టండి..
Actress
Follow us on

తెలుగు తెరపై పరభాష ముద్దుగుమ్మలు సూపర్ హిట్ సక్సెస్ అందుకుంటున్నారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం కేవలం ఒకటి రెండు సినిమాలతో స్క్రీన్ పై సందడి చేసి సైలెంట్ అవుతున్నారు. అభినయం.. అందం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోతుంది. దీంతో సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ అనుకున్నంతగా అవకాశాలు రాక సోషల్ మీడియాకు పరిమితమైపోతున్నారు. వెండితెరపై అలరించి.. ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైంది. గుర్తుపట్టండి. ఆమె అందం ముందు జాబిలమ్మ సైతం చిన్నబోతుందేమో. కాటుక దిద్దిన ఆ నయనాలకు కుర్రాళ్ల గుండెలు బేజారు కావాల్సిందే. గుర్తుపట్టండి.

ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరంటే హీరోయిన్ మేఘా ఆకాష్. 2017లో లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చల్ మోహన్ రంగ, పేట, రాజ రాజ చోర, ప్రియమైన మేఘ చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలు మేఘకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ నటనపరంగా మంచి మార్కులే అందుకుంది. అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. అలాగే ఓటీటీలోనూ సందడి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే గుర్తుందా శీతాకాలం, ప్రేమ దేశం చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె రావణాసుర, ప్రొడక్షన్ నెం. 1 చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.