Tollywood : సాగర తీరాన కుర్రాళ్ల కలల రాకూమారి.. కురుల మాటున దాగిన ఆ అందం ఎవరిదో గుర్తుపట్టగలరా ?..

ఇటీవల సెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీకి సంబంధించిన అరుదైన పిక్చర్ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. సాగర తీరాన కుర్రాళ్ల కలల రాకూమారి.. కురుల మాటున దాగిన ఆ అందం ఎవరిదో గుర్తుపట్టండి. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

Tollywood : సాగర తీరాన కుర్రాళ్ల కలల రాకూమారి.. కురుల మాటున దాగిన ఆ అందం ఎవరిదో గుర్తుపట్టగలరా ?..
Actress

Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:52 PM

ప్రస్తుతం సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధి సోషల్ మీడియా. ఇప్పుడు నేరుగా అభిమానులతో సినీ స్టార్స్ ముచ్చటించేందుకు సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తమ వ్యక్తిగత విషయాలను.. సినిమా అప్డే్ట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు మరింత దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీకి సంబంధించిన అరుదైన పిక్చర్ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. సాగర తీరాన కుర్రాళ్ల కలల రాకూమారి.. కురుల మాటున దాగిన ఆ అందం ఎవరిదో గుర్తుపట్టండి. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. హీరోయిన్ దివ్య భారతి. ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా చేయని ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

ఇటీవలి కాలంలో తెలుగు తెరకు పలువురు కథానాయికలు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్, అతుల్య రవి వంటి హీరోయిన్స్ తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు కొత్త హీరోయిన్స్ చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో కథానాయిక తెలుగు తెరకి రానుంది ..తనే దివ్య భారతి..

ఇవి కూడా చదవండి

సుడిగాలి సుధీర్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన జోడీగా దివ్యభారతి పరిచయమవుతోంది. మహాతేజ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. పాగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నరేష్ కుప్పిలి.. ఇప్పుడు సుధీర్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో దివ్య భారతి నటించనుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి టీమ్ సభ్యులు దివ్యభారతికి వెల్ కమ్ చెప్పారు. ఈ సినిమాతో తెలుగులో సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.