Tollywood: కెమెరా బంధించేసిన అందం.. ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టగలరా ?..

ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ వరుస చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టింది ఈ చిన్నది. కనిపెట్టారా ?.

Tollywood: కెమెరా బంధించేసిన అందం.. ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టగలరా ?..
Actress

Updated on: Mar 18, 2023 | 9:27 PM

అందం అమ్మాయైతే ఆమెలా ఉంటుందేమో అన్నట్లుగా ఉంటుంది తన రూపం. అచ్చ తెలుగమ్మాయిగా తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. సహజ నటనతో కట్టిపడేసింది. ఎవరో గుర్తుపట్టండి. ఆమెకు పాన్ ఇండియా లెవల్లో భారీగా ఫాలోయింగ్ ఉందండి బాబూ. తెలుగు కుర్రాళ్ల మనసు దొచేసిన ఈ చిన్నది.. ఇప్పుడు తెలుగులో మరో సినిమా చేస్తుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ వరుస చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టింది ఈ చిన్నది. కనిపెట్టారా ?. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదండి.. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్. ఇందులో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ హీరో రామ్ పాత్రలో కనిపించగా.. సీతామహాలక్ష్మిగా మెప్పించింది. తొలి చిత్రంతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది. ఇక ప్రస్తుతం నాని తదుపరి ప్రాజెక్ట్ లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది మృణాల్. ఆ తర్వాత విట్టి దండు సినిమాలో కథానాయికగా మెరిసింది. లవ్ సోనియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్, సూపర్ 30, బట్ల హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమకా, జెర్సీ చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా స్నేహితులతో కలిసి హాలీడే వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న మృణాల్.. అందుకు సంబంధించిన పోటోస్ షేర్ చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.