AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ క్యూట్ చిన్నారి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్.. ఆమె అందానికి ఏకంగా గుడి కట్టేసారు.. ఎవరో గుర్తుపట్టండి..

గత కొద్ది రోజులుగా నెట్టింట త్రోబ్యాక్ ఫోటోస్ అంటూ తారల చిన్ననాటి పిక్స్ తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ నటీనటుల చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోనే ఈ చిన్నారి క్యూట్ పిక్చర్ కూడా ఒకటి . పైన ఫోటోను చూశారు కదా.. ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ అగ్రకథానాయికగా కొనసాగింది. తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

Tollywood: ఈ క్యూట్ చిన్నారి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్.. ఆమె అందానికి ఏకంగా గుడి కట్టేసారు.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Jul 07, 2023 | 9:27 PM

Share

ప్రస్తుతం సెలబ్రెటీలు తమ చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరోహీరోయిన్ చిన్నతనంలో ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా నెట్టింట త్రోబ్యాక్ ఫోటోస్ అంటూ తారల చిన్ననాటి పిక్స్ తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ నటీనటుల చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోనే ఈ చిన్నారి క్యూట్ పిక్చర్ కూడా ఒకటి . పైన ఫోటోను చూశారు కదా.. ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ అగ్రకథానాయికగా కొనసాగింది. తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమె అందానికి గుడి కట్టేశారు. గుర్తుపట్టే ఉంటారు కదా.. తనే సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్. 1990లలో తమిళ్ సినీ ప్రపంచంలో ప్రముఖ నటిగా పేరు సంపాందించుకుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభు, కమల్ హాసన్, వెంకటేష్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. 1980లో ది బర్నింగ్ ట్రైన్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నసీబ్, లావారీస్, కాలియా, దర్ద్ కా రిష్తా చిత్రాల్లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత జాకీ ష్రాఫ్ సరసన జానూ చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తాన్ బదన్, దీవానా ముజ్ సా నహిన్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత సౌత్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

1986లో వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ అవకాశాలు అందుకుంది. 1991లో చిన్న తంబి సినిమా సమయంలో నటుడు ప్రభుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు 1993లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్, ప్రభు భార్య తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వీరిద్దరు పెళ్లైన నాలుగు నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2000లో ఆమె దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతూనే.. మరోవైపు సినిమాల్లో సహాయ నటిగా కనిపిస్తున్నారు ఖుష్బూ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.