Guess This Actress: బూరె బుగ్గలతో చూడగానే ముద్దొచ్చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు ఆమె చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

చంద్రబింబం వంటి మోము.. కాటుక దిద్దిన కలువల్లాంటి కళ్లతో యువతను కట్టిపడేస్తుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా అవకాశాలు కలిసి రావడం లేదు.

Guess This Actress: బూరె బుగ్గలతో చూడగానే ముద్దొచ్చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు ఆమె చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Actress

Updated on: Feb 23, 2023 | 10:37 AM

సోషల్ మీడియాలో ప్రస్తుతం సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‏కు తారలకు సంబంధించిన అరుదైన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ యంగ్ హీరోయిన్ బాల్యం ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. బూరె బుగ్గలతో చూడగానే ముద్దొచ్చేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు ఆమెను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. చంద్రబింబం వంటి మోము.. కాటుక దిద్దిన కలువల్లాంటి కళ్లతో యువతను కట్టిపడేస్తుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా అవకాశాలు కలిసి రావడం లేదు. అటు వెండితెరపైనే కాదు.. ఇటు ఓటీటీలోనూ రాణిస్తుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ అందాల చిన్నారి ఎవరంటే.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్. 1993 ఏప్రిల్ 5న జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 2017లో అక్కినేని అఖిల్ నటించిన హలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కళ్యాణి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం మానాడు వంటి చిత్రాల్లో నటించింది. అందం, టాలెంట్ ఉన్నా.. ఈ అమ్మడుకు మాత్రం అంతగా అవకాశాలు కలిసి రాలేదు. ప్రస్తుతం ఆమె బ్రో డాడీ చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.