Tollywood: లేడి పిల్లలా చెంగు చెంగున పరిగెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. కుర్రాళ్ల కలలరాణి..

|

Mar 31, 2023 | 9:17 PM

అంతేకాకుండా.. నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. జాతీయ స్థాయిలో అవార్డ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టండి. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

Tollywood: లేడి పిల్లలా చెంగు చెంగున పరిగెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. కుర్రాళ్ల కలలరాణి..
Actress
Follow us on

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ హీరోయిన్స్ హావా నడుస్తోంది. అటు కుర్రహీరోయిన్లకు పోటీగా ఉంటున్నారు సీనియర్ హీరోయిన్స్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పైన ఫోటోలో లేడి పిల్లల చెంగు చెంగున పరిగెడుతున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఆ అమ్మడుకు ఫాలోయింగ్ వేరేలెవల్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. రెండవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. జాతీయ స్థాయిలో అవార్డ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టండి. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. మహానటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మహానటి సినిమాతో మెప్పించింది. ఇందులో తన నటనతో అలనాటి హీరోయిన్ సావిత్రినే మైమరపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని వంటి స్టా్ర్ హీరోలతో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇక నిన్న విడుదలైన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి కలిసి నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెలా రూపొందించారు. ప్రస్తుతం కీర్తి మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. తాజాగా దసరా చిత్రీకరణ సమయంలో సెట్ లో చేసిన అల్లరి వీడియోను కీర్తి తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.