సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ సెలబ్రెటీస్ వ్యక్తిగత విషయాలు .. అరుదైన ఫోటోస్.. బాల్య జ్ఞాపకాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయికుల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలయ్యాయి. తాజాగా మరో చిన్నోడు పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ఒక్కసినిమాతో అతని క్రేజ్ మారిపోయింది. అంతేకాదు.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రాణస్నేహితుడు. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా స్నేహితుడే. ఎవరో గుర్తుపట్టారా.
ఈ చిన్నోడు మరెవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ భల్లాల దేవ.. అలియాస్.. రానా దగ్గుబాటి. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అన్నయ్య నిర్మాత సురేష్ బాబు తనయుడు. లీడర్ సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించిన రానా.. మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత నేను నా రాక్షసి, నా ఇష్టం , కృష్ణం వందే జగద్గురుం సినిమాలతో మెప్పించారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు భల్లాల దేవ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు రానా. చివరిసారిగా సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమాలో కనిపించారు.
ఈరోజు (డిసెంబర్ 14న) రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య మిహికా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రానా చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.