మెగాస్టార్ చిరంజీవి ముందు డ్యాన్స్ చేస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టరా ?.. టాలీవుడ్ స్టార్ హీరో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నటనలోనే కాదు.. డ్యాన్స్లోనే హీరోకు సాటి లేరు. చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హీరోగా తొలి సినిమాతోనే సినీ విమర్శకులను మెప్పించాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఎవరో గుర్తుపట్టారా ? తనే హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన బన్నీ … ఫస్ట్ మూవీతోనే నటనకు మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పటివరకు బన్నీ నటించిన సినిమాలు మంచి విజయం సాధించాయి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా.. చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఫాలోయింగా సంపాదించుకున్న బన్నీ..ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి ఉత్తరాదిలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో బన్నీ నటనకు, మేకోవర్ కు నార్త్ అడియన్స్ ఫిదా అయ్యారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడమే కాకుండా మూవీపై క్యూరియాసిటిని పెంచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.