
పై ఫొటోలో ఉన్న క్యూట్ గా ఉన్న అమ్మాయిలను గుర్తు పట్టారా? వీరు ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరూ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వీరు ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.ఇందులో ఒకరు పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ కుమార్తె అయితే.. మరొకరు ప్రముఖ నటి కూతురు. తమ తల్లిదండ్రుల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వీరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అతి తక్కువ కాలంలోనే తమ కంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నెట్టింట కూడా ఈ ముద్దుగుమ్మలకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ ముద్దుగుమ్మలెవరో గుర్తు పట్టారా? వారు మరెవరో కాదు.. ‘మహానటి’ కీర్తి సురేష్ .. ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్. ఇది వారి చిన్నప్పటి ఫొటో. వీరిద్దరివి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబాలే. ఇక చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులైన కీర్తి- కల్యాణిలు ఇప్పటికీ తమ ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్నారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తరచూ కలుస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిస్సీల కుమార్తెనే కల్యాణి ప్రియదర్శన్. ఆర్కిటెక్చరల్ డిజైన్ చదివిన ఆమె ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాల సెట్‌లో పనిచేసింది. విక్రమ్ ‘ఇరుముగన్’, హృతిక్ రోషన్ ‘క్రిష్ 3’ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆ తర్వాత 2017లో హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ అందాల తార. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కల్యాణి అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే చిత్రల హరి సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తెలుగులో నటించకపోయినా మలయాళంలో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇక కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కొన్ని నెలల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రొఫెషనల్ కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్ లో ఉంది. ఇటీవలే ఉప్పుకప్పురంబు సినిమాతో ఆడియెన్స్ ను పలకరించిన కీర్తి త్వరలోనే రివాల్వర్ రీటా గా మరోసారి మన ముందుకు రానుంది. దీంతో పాటు మరో మూవీలోనూ నటిస్తోందీ మహానటి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.