ఈ కుర్రాళ్లను గుర్తు పట్టారా? ఇద్దరూ స్టార్ హీరోలే.. ఒకరు అందనంత ఎత్తుకు.. ఇంకొకరు అథఃపాతాళానికి
సినిమా ఇండస్ట్రీలోని హీరోల్లో చాలా మంది చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. కెరీర్ లో సెటిలైనప్పటికీ ఇప్పటికీ తమ ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్నారు. ఈ కింది ఫొటోలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు.

పై ఫొటోలో ఉన్న కుర్రాళ్లను గుర్తు పట్టారా? చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీరు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయినా ఇప్పటికీ తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకరు పాన్ ఇండియా ఫేమస్. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ సత్తా చాటారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమాల్లోనూ మెరిశాడు. చూడ్డానికి ఆరడుగులు అజానాబాహుడిలా కనిపించే ఈ హీరోకు అభిమాన గణం కూడా ఎక్కువే. 54 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్ గా, హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరోకు సినిమా ఇండస్ట్రీలో పాతి కేళ్ల అనుబంధముంది. కేవలం సినిమాలే కాదు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఇక మరో హీరో కూడా తక్కువేమీ కాదు. రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ నటుడు ఇప్పటివరకు సుమారు 50 కు పైగా సినిమాలు చేశాడు. నిర్మాతగానూ సత్తా చాటాడు. ఇక ఈ 48 ఏళ్ల హీరోకు కూడా అభిమాన గణం ఎక్కువే. సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇదంతా నిన్నటి వరకు.
పై హీరోల్లో ఒకరు సినిమాలు, బిగ్ బాస్ లాంటి టీవీ షోలతో బిజీగా ఉంటే మరొకరు జైలు జీవితం గడుపుతున్నాడు. ఒక హత్య కేసులో నిందితుడిగా కారాగారంలో ఉంటున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. వీరు మరెవరో కాదు కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్. ఇది వారి చిన్ననాటి ఫొటో.
సుదీప్, దర్శన్.. అప్పుడు .. ఇప్పుడు..
View this post on Instagram
చిన్నప్పటి నుంచే సుదీప్, దర్శన్ లు మంచి స్నేహితులు. అందుకే ఒక రంగంలో స్థిర పడ్డారు. స్టార్ హీరోలుగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల దర్శన్ ఒక హత్య కేసులో జైలు పాలయ్యాడు. అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఈ హీరోపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో గతంలోనే జైలు కెళ్లిన దర్శన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలపడంతో బెయిల్ రద్దయ్యింది. దీంతో ఇప్పుడు మళ్లీ బెంగలూరు పరప్సన అగ్రహారం జైలులో ఉన్నాడు దర్శన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








