Tollywood: ఈ చిన్ని కృష్ణుడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ప్రభాస్, బాలయ్యలతో బ్లాక్ బస్టర్స్

ఈ హీరోయిన్ క్రేజ్ ఏపాటిది అంటే.. ఒక అభిమాని ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయిపోయాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఇందుకోసం సదరు హీరోయిన్ ను కిడ్నాప్ కూడా చేశాడు. అయితే హీరోయిన్ అప్రమత్తంగా ఉండడంతో ముప్పు తప్పించుకుంది.

Tollywood: ఈ చిన్ని కృష్ణుడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ప్రభాస్, బాలయ్యలతో బ్లాక్ బస్టర్స్
Tollywood Actress

Updated on: Nov 20, 2025 | 6:46 PM

పై ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేసింది.స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోకపోయినా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తెలుగులో అయితే వెంకటేష్, రవితేజ, రాజశేఖర్, ప్రభాస్, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక తమిళంలో అయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఈ అమ్మడి అందానికి తమిళ అభిమానులు ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే.. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టేసి పూజలు చేశారు. అంతేకాదు.. ఒక అభిమాని ఏకంగా ఈ అందాల తారను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం పకడ్బందీగా కిడ్నాప్ ప్లాన్ కూడా వేశాడు. అయితే అదేమీ జరగలేదు. అయితే ఈ అందాల తార పెద్దగా సినిమాలు చేయడం లేదు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్న ఆమె ఆ మధ్యన బీజేపీలో చేరింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసింది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో రచ్చ రేపుతోన్న ఈ అందాల తార మరెవరో కాదు అందాల తార నమిత. ఇది ఆమె చిన్నప్పటి ఫొటో.

తెలుగులో సొంతం, జెమిని, సింహా, బిల్లా, ఒక రాజు ఒకరాణి తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నమిత. సినిమాల్లో ఉండగానే ఆమె మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరిని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 2017లో తిరుమలలో వీరి వివాహం జరిగింది. 2022 ఆగస్టులో ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పిల్లల ఆలనాపాలనతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

నమిత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

సినిమాల విషయానికి వస్తే.. 2020లో ఓ తమిళ సినిమాలో చివరిగా కనిపించింది నమిత. ఆ మధ్యన కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొంది. బీజేపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరింది. అలాగే అప్పుడప్పుడూ తమిళ రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటూ వార్తల్లో నిలుస్తోంది నమిత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us