Nagarjuna: నాగ్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? స్టార్ డైరెక్టర్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో

స్టార్ డైరెక్టర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 50కు పైగా తెలుగు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. తనదైన నటనతో ట్యాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఫిల్మ్ పేర్, నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.

Nagarjuna: నాగ్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? స్టార్ డైరెక్టర్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో
Akkineni Nagarjuna

Updated on: Nov 06, 2025 | 10:01 PM

పై ఫొటోలో హీరో అక్కినేని నాగార్జునతో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఒక ప్రముఖ డైరెక్టర్ కుమారుడు. ఇప్పుడీ పిల్లాడు కూడా హీరోగా ఎదిగిపోయాడు. టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా వేగంగా సినిమాలు చేశాడు. అలా ఒక ఏడాది అతను నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయంటే ఈ హీరో గారి స్పీడ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందులో చాలా వరకు హిట్ సినిమాలే. తన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ హీరో ఈ మధ్యన రూటు మార్చాడు. సీరియస్ సబ్జెక్టులతోనూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న ఈ హీరో మరెవరో కాదు మన అల్లరి నరేష్. ఇది అతని చిన్ననాటి ఫొటో. ఈవీవీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో హలో బ్రదర్ ఒకటి. ఇందులో నాగ్ ద్విపాత్రాభినయం చేశాడు. నాగ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హలో బ్రదర్ సినిమా షూటింగులోనే అక్కినేని హీరోను సరదాగా కలిశాడు నరేష్.

కాగా నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు అల్లరి నరేష్. గతేడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇక దీని తర్వాత ఆ ఒక్కటి అడక్కు, బచ్చల మల్లి సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు నరేష్. ఇందులో బచ్చల మల్లి సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా నటనా పరంగా అల్లరి నరేష్ మంచి పేరు తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

భార్యతో అల్లరి నరేష్..

ఇక ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు అల్లరి నరేష్. 12 ఏ రైల్వే కాలనీ, ఆల్కహాల్, సభకు నమస్కారం అనే సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇప్పటికే ఈ సినిమాల నుంచి రిలీజైన అప్డేట్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.