Tollywood: బ్లాక్ బస్టర్ కొట్టాడు.. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా రిలీజులకు ముందు, తర్వాత చాలా మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు చాలా మంది సినీ ప్రముఖులు. గతంలో నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి, సందీప్ రెడ్డివంగా వంటి డైరెక్టర్లు అయితే తమ సినిమా రిలీజ్ లయ్యాక తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించారు.

Tollywood: బ్లాక్ బస్టర్ కొట్టాడు.. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director

Updated on: Oct 23, 2025 | 8:19 PM

తిరుమల శ్రీవారిని ప్రతి రోజు వేలాదిమంది దర్శించుకుంటారు. అలా గురువారం (అక్టోబర్ 23) కూడా చాలా మంది భక్తులు ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీనివాసుడికి మొక్కులు సమర్పించారు. అందులో ఒక టాలీవుడ్ ప్రముఖుడు కూడా ఉన్నాడు. అతను ఇటీవలే ఒక సినిమా చేశాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అందుకున్నాడు. కేవలం రూ. 60 కోట్లతో ఈ సినిమా తీస్తే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది.ఈ నేపథ్యంలోనే తన సినిమా విజయం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్. స్వామి వారికి తలనీలాలు సమర్పించాడు.

గతంలో వెంకీ అట్లూరి, నాగ్ అశ్విన్ , సందీప్ రెడ్డి వంగా వంటి ఎంతో మంది టాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమా రిలీజ్ లయ్యాక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించి మొక్కులు కూడా తీర్చుకున్నాడు. అలా ఇటీవల బ్లాక్ బస్టర్ కొట్టిన ఓ యంగ్ డైరెక్టర్ కూడా గురువారం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. స్వామి వారికి మొక్కులు సమర్పించాడు. పై ఫొటోలో గుండుతో కనిపిస్తున్నది ఆ డైరెక్టరే. మరి అతనెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.

ఇవి కూడా చదవండి

మిరాయ్ చిత్ర బృందం గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో తేజ సజ్జాతో పాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన వీరితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు మాట్లాడారు తేజ సజ్జా, డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని.

జియో హాట్ స్టార్ లో మిరాయ్ రికార్డులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.