Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. మూడు పెళ్లిళ్లతో ఇండస్ట్రీలో సంచలనం.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లిదండ్రులిద్దరూ దిగ్గజ నటులే. వారి అడుగజాడల్లోనే నడుస్తూ ఈ ముద్దుగుమ్మ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ సినిమాలకంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ అందాల తార పెళ్లిళ్ల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా?ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. కెరీర్ ప్రారంభంలో పలు కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే కెరీర్ గాడి తప్పింది. సినిమా అవకాశాలు దూరమయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత సమస్యలు చుట్టు ముట్టాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తీవ్ర ఆటు పోటులు ఎదుర్కొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ మూడు విడాకులతోనే ముగిశాయి.కేవలం పెళ్లిళ్లే కాదు ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుందీ అందాల తార. ఆ మధ్యన నాలుగో పెళ్లి అంటూ వార్తలు వచ్చినా అవి రూమర్లు గానే మిగిలాయి ఇప్పుడు తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవితం గడుపుతోన్న ఆ అమ్మడు మరెవరో కాదు వనితా విజయ్ కుమార్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
ప్రముఖ నటుడు విజయ్ కుమార్, ఆయన రెండో భార్య మంజుల కూతురే వనితా విజయ్ కుమార్. కెరీర్ ప్రారంభంలో దేవి లాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. దళపతి విజయ్ లాంటి హీరోల సినిమాల్లోనూ కథానాయికగా యాక్ట్ చేసింది. కానీ ఉన్నట్లుండి ఈ నటి కెరీర్ గాడి తప్పింది. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యిందీ అందాల తార. ముఖ్యంగా తన మూడు పెళ్లిళ్లతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వనిత మొదట నటుడు ఆకాశ్ ను పెళ్లి చేసుకుంది. వీరికి శ్రీహరి అనే కొడుకు ఉన్నాడు. కానీ 2007లో వనిత- ఆకాశ్ విడిపోయారు. అదే ఏడాది రాజన్ అనే అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుందీ సొగసరి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు – జోవికా, జయనిక. ఈ పెళ్లి కూడా 5 ఏళ్లకే పెటాకులైంది.
కూతురితో వనితా విజయ్ కుమార్..
View this post on Instagram
ఇక 2020 లాక్ డౌన్ సమయంలో పీటర్ పాల్ నిపెళ్లి చేసుకుంది వనిత. అయితే కొన్ని నెలలకే ఈ పెళ్లి బంధం కూడా ముగిసింది. ఇలా పెళ్లిళ్లతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న వనిత అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఆ మధ్యన నరేష్-పవిత్రలు నటించిన `మళ్లీపెళ్లి` సినిమాలో నరేష్ మూడో భార్య పాత్రలో నటించింది. ఇప్పుడు తన కూతురును కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
రజనీకాంత్ తో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
