
హీరోలతో పోల్చుకుంటే సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా 2,3 సినిమాలు ఫ్లాఫ్ అయితే చాలు ఫేడవుట్ అయిపోతారు. అలాగే పెళ్లి, పిల్లల తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అయితే ఇలా దూరమైన వాళ్లలో చాలా మంది ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సహాయక నటులుగా సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ టాలీవుడ్ నట కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. తన నటనతో అందర్నీ మెప్పించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పింది.
సినిమాలకు దూరమైనా ఈ టాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన ఫ్యామిలీ ఫొటోలను తరచూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. అలా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటో అదే. మరె ఆమె ఎవరో గుర్తు పట్టారా? మాతృదేవోభవ సినిమాలో తన నటనతో కన్నీళ్లు పెట్టించిన మాధవి లేటెస్ట్ ఫొటోనే అది.
మాధవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఖైదీ, బిగ్ బాస్, మరోచరిత్ర, కోతల రాయుడు, మండే గుండెలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇలా చాలా సినిమాలు మాధవికి మంచి గుర్తింపు తీసుకచ్చాయి. తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా చాలా సినిమాలు చేసిందీ అందాల తార. కాగా సినిమాల్లో ఉండగానే మాధవి 1996లో రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ఆ తర్వాత నుంచి మళ్లీ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం మాధవికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వ్యాపారాల్లో బిజీగా ఉండే ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తోంది. అలా తాజాగా ఆమె
తన ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Madhavi Family
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.