Tollywood: ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార.. ఇప్పుడేమో ఇలా.. వీడియో

తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. తన అందం, అభినయంతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ సహాయక నటిగా మెరుస్తోన్న ఆమె తాజాగా ఊహించని గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tollywood: ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార.. ఇప్పుడేమో ఇలా.. వీడియో
Radhika Sarathkumar

Updated on: Dec 24, 2025 | 6:57 PM

పై ఫొటోలో ఉన్న ముసలావిడను గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ సీనియర్ నటి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ చలనచిత్ర పురస్కారం , రెండు నంది అవార్డులు , మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతుందామె. తాజాగా ఆమె నటించిన ఒక కొత్త సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో ఆమె వృద్ధురాలిగా కనిపించి ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. మాస్ లుక్ లో కనిపించిన ఆమెను మొదట చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మరి ఆ ముసలావిడ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు రాధికా శరత్ కుమార్.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషల్లో సహాయక నటిగా మెప్పిస్తోంది రాధిక. ఇందులో భాగంగా ఆమె నటించిన తాజా చిత్రం ‘థాయ్‌ కిజావి’. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించారు. రాధికతో పాటు సింగమ్‌ పులి, అరుళ్‌ దాస్‌, బాల శరవణన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది. ఇందులో రాధిక వృద్ధురాలి పాత్రలో కనిపించింది. ఇలాంటి పాత్ర పోషించడం ఆమెకు ఇదే మొదటి సారి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. మరి ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అందులోనూ రాధిక గెటప్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇవి కూడా చదవండి

‘థాయ్‌ కిజావి’ సినిమాలో రాధిక..

జిమ్ లో రాధిక..

‘థాయ్‌ కిజావి’ సినిమా టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.