Tollywood: ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే ఆ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది పెద్ద పెద్ద చదువుల చదివిని వారే. విదేశాల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన వాళ్లే. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

పై ఫొటోలో ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. అలాగనీ పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఏపీకి చెందిన ఈ తెలుగమ్మాయి బ్యాచిలర్ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. కొద్ది రోజుల పాటు జాబ్ కూడా చేసిందట. దీంతో ఈ అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద జాబ్ లు చేస్తుందని, ఆస్ట్రేలియాలో స్థిర పడిపోతుందని చాలా మంది భావించారు. అయితే నటనపై మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. హైదరాబాద్ లో తన సోదరి దగ్గర ఉంటూనే మోడల్ గా పనిచేసింది. అలాగే సినిమా ఆడిషన్స్ కు హాజరైంది. ఇదే క్రమంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఓ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే ఈ మూవీ ఆడియెన్స్ ను నిరాశ పర్చాయి. కానీ ఈ హీరోయిన్ మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. ఎందుకంటే తన మొదటి మూవీలో హీరోగా నటించిన అబ్బాయితోనే ప్రేమలో పడిందీ అందాల తార. ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలోనే వైవాహిక బంధంలోకి కూడా అడుగు పెట్టనున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారో? మన భైరవం హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య, నటి సిరి లేళ్ల.
నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 మూవీలో హీరోయిన్ గా నటించింది సిరి లేళ్ల. ఈ సినిమా షూటింగులోనే ఇద్దరి మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమకు ఆశీర్వాదం తెలపడంతో గతేడాది అక్టోబర్ లో అతిరథ మహారథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఫ్యామిలీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. కాగా ఈ మధ్యనే నారా రోహిత్ తండ్రి కన్ను మూశారు. ఆ బాధను అధిగమించి భైరవం సినిమా షూటింగ్ పూర్తి చేశాడీ హీరో. త్వరలోనే సిరి లేళ్లతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.
నారా రోహిత్ తో సిరి లేళ్ల..
View this post on Instagram
సీఎం చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకుంటోన్న సిరి లేళ్ల..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








