Tollywood: చైనాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు టాలీవుడ్‌లోక్రేజీ హీరోయిన్.. ఈ డేరింగ్ బ్యూటీని గుర్తు పట్టారా?

'డాక్టర్ అవ్వాల్సింది యాక్టరయ్యాను'.. మన సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లలో చాలా మంది ఎంబీబీఎస్ చదివిన వారే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజి బిజీగా ఉంటోన్న ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ సుమారు ఆరేళ్ల పాటు డాక్టర్ గానూ సేవలందించింది.

Tollywood: చైనాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు టాలీవుడ్‌లోక్రేజీ హీరోయిన్.. ఈ డేరింగ్ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Feb 27, 2025 | 7:32 PM

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? తెలంగాణకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్ లోనే చదువుకుంది. ఆ తర్వాత చైనాకు వెళ్లిపోయి అక్కడే ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత చైనాలోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్ డాక్టర్‌గా పని చేసింది. ఆపై ఇండియాకు తిరిగొచ్చి అపోలో ఆస్పత్రిలో ఆరేళ్ల పాటు సేవలందించింది. అయితే చిన్నప్పటి నుంచి నటి కావాలని కలలు కన్న ఆమె మొదట మోడలింగ్ రంగంలో అదృష్టం పరీక్షించుకుంది. మిస్ తెలంగాణ పోటీల్లో విజేతగానూ నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌ లోనూ అడుగు పెట్టింది. ఆపై మెయిన్ లీడ్ లోనూ నటించి అందరి మన్ననలు అందుకుంది. చేతి నిండా సినిమాలతో ఈ నటి ప్రస్తుతం బిజి బిజీగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు పొలిమేర సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కామాక్షి భాస్కర్ల. ఇది ఆమె టీనేజ్ నాటి ఫొటోస్.

2022లో ప్రియురాలు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కామాక్షి భాస్కర్ల. ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (), ‘మా ఊరి పొలిమేర , ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘మా ఊరి పోలిమేర2’, ఓం భీమ్ బుష్ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘ఝాన్సీ’, ‘సైతాన్’ ‘ధూత’ వంటి సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించింది. కాగా 2018 లో కామాక్షి చాలా బొద్దుగా ఉండేది. అప్పట్లో ఆమె బరువు సుమారు 80 కిలోలు. అయితే అందాల పోటీల 20 కిలోల బరువు తగ్గింది. ఇప్పుడు మరింత అందంగా తయారైందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామాక్షి భాస్కర్ల..

సినిమాల సంగతి పక్క పెడితే కామాక్షి కి సామాజిక స్పృహ చాలా ఎక్కువ. ఆమె చాలా కాలంగా ఏంజెల్ హౌస్, వాయిస్ 4 గర్ల్స్, మేక్ ఎ డిఫరెన్స్ వంటి NGOలలో పనిచేస్తోంది.

చీరలో కామాక్షి భాస్కర్ల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.