AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthiki Vasthunam OTT: అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేశ్‌ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది.

Sankranthiki Vasthunam OTT: అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sankranthiki Vasthunam Movie
Basha Shek
|

Updated on: Feb 27, 2025 | 7:24 PM

Share

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీ మామా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగాథియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మేకర్స్ ఆడియెన్స్ కు షాకిచ్చారు. ఓటీటీ కంటే ముందు టీవీల్లో ఈ సినిమాను ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓటీటీపై మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. టీవీల్లో ప్రసారం చేయడంతో ఓకేసారి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అలాగే శాటిలైట్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగుతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5లో విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ స్ట్రీమింగ్ కానుంది.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను నిర్మించారు. విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. అలాగే ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి, మురళీ ధర్ గౌడ్, మాస్టర్ రేవంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక భీమ్స్ సిస్రిలియో అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే టీవీల్లో లేదా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఒకే సారి ఓటీటీలోనూ, టీవీలోనూ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే