Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? జాబ్ మానేసి డ్యాన్సులు.. ఇప్పుడేమో హీరోయిన్.. ఏకంగా ప్రభాస్‌తోనే..

|

Oct 13, 2024 | 3:26 PM

మొన్నటివరకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోన్న ఈ అమ్మాయి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. సినిమాల్లోని పాటలకు అందంగా డ్యాన్స్ చేస్తూ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేయనుంది. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ క్యూటీ...

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? జాబ్ మానేసి డ్యాన్సులు.. ఇప్పుడేమో హీరోయిన్.. ఏకంగా ప్రభాస్‌తోనే..
Tollywood Actres
Follow us on

పై ఫొటోలో అమ్మ ఒడిలో చిరునవ్వుల చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో బాగా ఫేమస్. అలాగనీ ఆమె స్టార్ హీరోయిన కాదు. ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడీ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. దానికి కారణం ఆమె డ్యాన్స్. అలాగే సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్. ఇవే ఆమెను హీరోయిన్ గా మార్చేశాయి. మొన్నటివరకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోన్న ఈ అమ్మాయి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. సినిమాల్లోని పాటలకు అందంగా డ్యాన్స్ చేస్తూ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేయనుంది. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ క్యూటీ వెండితెర ప్రవేశానికి రంగం సిద్ధమైంది. అది కూడా ఏకంగా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న ఓ పాన్ ఇండియా సినిమాలో. మరి ఈమె ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇమాన్వి. అదే నండి హను రాఘవ పూడి- ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ హీరోయిన్.

 

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్వికి డ్యాన్స్ అంటే పిచ్చి. అందుకే ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేసినా సరే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టెప్పులు కనిపెట్టేది. దీనిని గమనించిన ఆమె తండ్రి యూట్యూబ్ ఛానెల్ పెట్టుకోవచ్చుగా అని ఇమాన్వీకి సలహా ఇచ్చారట. తల్లి కూడా ఇందుకు బాగా సపోర్ట్ చేసిందట. అంతే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ టైమ్ డ్యాన్సర్ గా మారిపోయింది. ఈవెంట్లలో పాల్గొనడమే కాకుండా నెట్టింట రీల్స్ తో బిజీ బిజీగా మారిపోయింది.

ప్రభాస్- హను రాఘవపూడి సినిమాలో..

 

డ్యాన్స్ సంగతి పక్కన పెడితే.. ఇమాన్వీ ఇచ్చే ఎక్స్ ప్రెషన్లకు నెటిజన్లు ముగ్దులయ్యారు. ఈ కారణంగానే ఇన్‌స్టాలో ఇమాన్వీకి ఏకంగా తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలు టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడా కంట్లో పడటంతో ప్రభాస్ తో తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.

ఇమాన్వీ డ్యాన్స్ వీడియో..

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .