Tollywood: స్టార్ డైరెక్టర్ వారసులు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోలు.. ఈ బ్రదర్స్‌ ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ లో హీరోలుగా వెలుగొందుతోన్న అన్నదమ్ములు చాలామందే ఉన్నారు. నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్ తో సహా చాలా మంది బ్రదర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇందులో కొందరు హీరోలుగా రాణిస్తుంటే మరికొందరు నిర్మాతలు, దర్శకులుగా సత్తా చాటుతున్నారు.

Tollywood: స్టార్ డైరెక్టర్ వారసులు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోలు.. ఈ బ్రదర్స్‌ ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actors

Updated on: Nov 19, 2025 | 6:57 PM

పై ఫొటోలో ఉన్న అన్నదమ్ములను గుర్తు పట్టారా? ఒకప్పుడు వారు స్టార్ డైరెక్టర్ వారసులు. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ హీరోలుగానే ఎంట్రీ ఇచ్చారు. వరుసగా విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా తమ తండ్రిలాగానే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. తమ నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడపుబ్బా నవ్వించారు. అయితే ఇందులో ఒకరు ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు సహాయక నటుడి పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకొకరు మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఒకే ఏడాదిలో 8 సినిమాలు చేసి రికార్డు సృష్టించిన ఈ హీరో ఇప్పుడు మాత్రం ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు కామెడీ సినిమాలు చేస్తూ నవ్విస్తూనే మరోవైపు సీరియస్ సబ్జెక్టులతో విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి పై ఫొటోలో ఉన్న బ్రదర్స్ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అందులో ఉన్నది మరెవరో కాదు ఆర్యన్ రాజేశ్, అల్లరి నరేష్. ఇది వారి చిన్ననాటి ఫొటో. మధ్యలో ఉన్నది వారి తల్లి.

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన బాటలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్. ఇందులో ఆర్యన్ రాజేష్ కెరీర్ ప్రారంభంలో చాలా మంచి సినిమాలు చేశాడు. యూత్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత రేసులో వెనకబడిపోయాడు. ప్రస్తుతం ఈ నటుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. మరోవైపు కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా వరుసగా సినిమాలు చేస్తున్నాడు అల్లరోడు.

ఇవి కూడా చదవండి

తండ్రి ఈవీవీని గుర్తు చేసుకుంటూ..

అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 12A రైల్వే కాలనీ. నాని కాసరగడ్డ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. పొలిమేర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న 12A రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.