Naga Babu: నాగ బాబుతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. చరణ్, వరుణ్ కానే కాదు

సినిమాలతో పాటు ఈ టాలీవుడ్ హీరోకు సామాజిక స్పృహ ఎక్కువ. పేదలు, అనాథలు, వృద్ధులకు తన వంతు సాయం చేస్తుంటాడు. పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటాడు. అలాగే చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటాడు.

Naga Babu: నాగ బాబుతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. చరణ్, వరుణ్ కానే కాదు
Naga Babu

Updated on: Oct 15, 2025 | 7:42 AM

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అటు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్.. ఇలా దాదాపు పది మంది హీరోలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ లెగసీని కొనసాగిస్తున్నారు.ఇక మెగా హీరోల్లో నాగబాబు చాలా స్పెషల్. కెరీర్ ప్రారంభంలో హీరోగా, ఆ తర్వాత సహాయక నటుడిగా, నిర్మాతగా, బుల్లితెర హోస్ట్ గా సత్తా చాటారాయన. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలు, టీవీ షోలక దూరంగా ఉన్నారు. మరి పై ఫొటోలో నాగ బాబుతో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? అతను కూడా మెగా హీరోనే. పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు బాగా ఇష్టమైన వ్యక్తి. అలాగనీ అందులో ఉన్న పిల్లాడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కాదు. పోలికల్లో చిరంజీవి, పవన్ లా ఉండే ఈ హీరో యాక్టింగ్ లోనూ, డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ ల్లోనూ వారిని గుర్తు చేస్తుంటాడు. ఆ మధ్యన ఒక యాక్సిడెంట్ బారిన పడి కోమాలోకి వెళ్లి పోయాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడి మళ్లీ సినిమాలు చేస్తు అలరిస్తున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ అతను మరెవరో కాదు సాయి దుర్గ తేజ అలియాస్ సాయి ధరమ్ తేజ్.

బుధవారం (అక్టోబర్ 15) సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ మెగా మేనల్లుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయి దుర్గ తేజ్ విరూపాక్ష సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కు పైగా కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన బ్రో కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం సంబరాల యేటి గట్టు అనే ఓ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..