
మెగా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానముంది. మెగాస్టార్ చిరంజీవి మొదలు పంజా వైష్ణవ్ తేజ్ వరకు.. సుమారు పది మంది హీరోలు టాలీవుడ్ లో రాణిస్తున్నారు. వీరిలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరిష్ కూడా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. కాగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ మధ్యలో సరదాగా కూర్చున్న ఈ బుడ్డో డిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ హీరో. ఆరడుగుల కటౌట్ తో ఉన్న ఈహీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇతర హీరోలకు భిన్నంగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం ఈ హీరోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. సక్సెస్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఈ హీరో మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆదివారం (జనవరి 19) ఈ మెగా హీరో పుట్టిన రోజు. దీంతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వరుణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే సందర్భంలో వరుణ్ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
కాగా ఈ మధ్యన వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాయి. అలాగే ఇటీవల భారీ అంచనాలతో రిలీజైన మట్కా కూడా నిరాశ పర్చింది. కానీ ఈ సినిమాల్లో వరుణ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో ఇకనైనా వరుణ్ మంచి కథలతో ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Here’s to a year of growth and resilience.
To embracing what truly matters and chasing what brings you joy.
May you have the courage to follow your dreams and to never give up.Let’s go, 2025! pic.twitter.com/nIpY1KAXfV
— Varun Tej Konidela (@IAmVarunTej) January 1, 2025
కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం మేకపార్ల గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.