Tollywood: ఈ గుండు పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు ట్రెండింగ్ టాలీవుడ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే 300 కోట్లు

2017లో ఓ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ భాషల్లో చాలా సినిమాలు చేసింది. అయితే ఇటీవల ఈ బ్యూటీ లీడ్ రోల్ పోషించిన ఒక సినిమా బాక్సాఫీస్ రికార్డులను తుడిచేసింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.

Tollywood: ఈ గుండు పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు ట్రెండింగ్ టాలీవుడ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే 300 కోట్లు
Tollywood Actress

Updated on: Oct 07, 2025 | 8:33 PM

పై ఫొటోలో ఉన్న గుండు పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి తండ్రి స్టార్ డైరెక్టర్. తల్లి ప్రముఖ నటి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్చిటెక్చర్ (బీఆర్క్) విభాగంలో డిగ్రీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ట్రైన్డ్ డ్యాన్సర్ కూడా. చదువు తర్వాత న్యూయార్క్ వెళ్లి నటనలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత అమ్మానాన్నల అడుగు జాడల్లోనే నడుస్తూ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల ఫేవరెట్ గా మారిపోయింది. తెలుగులో సాయి ధరమ్ తేజ్, అక్కినేని అఖిల్, శర్వానంద్ లాంటి ప్రామిసింగ్ హీరోలతో కలిస స్క్రీన్ చేసుకున్న ఈ అందాల తార ఫహాద్ ఫాజిల్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ సినిమా చేసింది. అందులో ఆమె ఫిమేల్ సూపర్ హీరో రోల్ లో అదరగొట్టింది. ఆగస్టు ఆఖరి వారంలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ ‘సూపర్ హీరో’యిన్ మూవీ రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ అభినయానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లోనే కనిపించిన ఈ అందాల తార ఇప్పుడు ఫిమేల్ సూపర్ హీరోగా అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ మరెవరో కాదు కొత్త లోక ఛాప్టర్ 1 సినిమాతో రికార్డులు తిరగరాసిన కల్యాణి ప్రియదర్శన్.

అఖిల్ అక్కినేని సరసన ‘హలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కల్యాణి ప్రియదర్శన్ . ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో ‘చిత్రలహరి’, శర్వానంద్ సరసన ‘రణరంగం’ చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటి తర్వాత కేవలం మలయాళంలోనే సినిమాలు చేస్తోందీ అందాల తార. అలా ఇటీవల సూపర్ ఉమెన్‌గా ‘ కొత్త లోక చాప్టర్ 1 ’ సినిమాతో మన ముందుకు వచ్చింది కల్యాణి. అరుణ్‌ డొమినిక్ తెరకెక్కించిన ఈ సినిమాకు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇండియాలోనే మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే కావడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి

కల్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..