AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మకూచిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్.. ఇప్పుడేమో వరుస ప్లాఫ్‌లతో డీలా

పై ఫొటోలో అమ్మతో కలిసి ఫొటోకు పోజులిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. తన అందం, అభినయంతో ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు నాట ఈ అమ్మాయికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసింది

Tollywood: ఈ అమ్మకూచిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్.. ఇప్పుడేమో వరుస ప్లాఫ్‌లతో డీలా
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 4:47 PM

Share

పై ఫొటోలో అమ్మతో కలిసి ఫొటోకు పోజులిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. తన అందం, అభినయంతో ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు నాట ఈ అమ్మాయికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక తమిళంలో విజయ్ దళపతితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. హిందీలో ఏకంగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. కొన్ని నెలల వరకు స్టార్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న ఈ అమ్మడిని ఇప్పుడు దురదృష్టం వెంటాడుతోంది. ఏ భాషలో ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా ప్లాఫ్ గానే నిలుస్తోంది. దీంతో ఈ అందాల తార ఇప్పుడు కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడీ బ్యూటీ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా స్టార్ హీరోల సినిమాలు. ఈ రెండు సినిమాల్లో ఒకటి హిట్ గా నిలిచినా ఈ ముద్దుగుమ్మకు గ్రేట్ కమ్ బ్యాక్ దొరికినట్టే. మరి ఈ సొగసరిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ మరెవరో కాదు మన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. అందులో ఉన్నది ఆమె తల్లి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పూజా కొన్ని రోజుల క్రితం ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో కనిపించక సుమారు మూడేళ్లు అవుతోంది. ఆమె చివరిసారిగా ప్రభాస్ రాధేశ్యామ్ లో కనిపించింది. ఆ తర్వాత వెంకటేశ్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే సందడి చేసింది. ఇక చివరిగా సల్మాన్‌ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమాలో నటించింది పూజా హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరో సూర్య 44 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. దీనికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. దీంతో పాటు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది పూజా. దేవా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూజా హెగ్డే లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Pooja Hegde (@hegdepooja) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us