
పై ఫొటోలో ఉన్న ఇద్దరు అబ్బాయిలను గుర్తు పట్టారా? వారిద్దరూ అన్నదమ్ములు. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం దక్షిణాదిలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ బ్రదర్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఇందులో ఒకరు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. మరొకరు తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరోలైనా టాలీవుడ్ లోనూ వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరి సినిమా వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు ఆడియెన్స్ తో నిండిపోతాయి. అందుకే వీరు నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బీజీబీజీగా గడుపుతున్న ఈ అన్నదమ్ములెవరో గుర్తు పట్టారా? ఈ ఫొటో చూసిన అభిమానుల్లో కొందరు ఇప్పటికే ఈ అబ్బాయిలను కనిపెట్టి ఉండవచ్చు. వారెవరో కాదు సూర్య అండ్ కార్తీ. ఇవాళ (మే 29) కార్తీ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో కార్తీతో పాటు సూర్యతో కలిసున్న ఇద్దరి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు కార్తీ. ఆ తర్వాత అవారా, నా పేరు శివ, శకుని, దొంగ, చెలియా, ఊపిరి, ఖైదీ, సర్దార్, సత్యం సుందరం తదితర సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు కార్తీ.
We at @Prince_Pictures wish the stellar actor and our dearest @Karthi_Offl sir a very happy birthday.#Sardar2@ivyofficial2023 @Psmithran @iam_SJSuryah @lakku76 @venkatavmedia @RajaS_official @B4UMotionPics @MalavikaM_ @AshikaRanganath @rajishavijayan @iYogiBabu @SamCSmusic… pic.twitter.com/AfT5nabrG7
— Prince Pictures (@Prince_Pictures) May 25, 2025
ప్రస్తుతం ఖైదీ 2, సర్దార్ 2, ఖాకీ 2, కంగువా 2 సినిమాల్లో నటిస్తున్నాడు కార్తీ. అలాగే యుగానికి ఒక్కడు సీక్వెల్ కూడా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.
Dropping UNSEEN STILLS from an unforgettable event featuring our @Karthi_Offl Anna 😍
A Pure #Karthi na Charm! ❤️#HappyBirthdayKarthi#MrVersatileKarthi pic.twitter.com/OxezDV90H3
— Karthi Fans Club (@Karthi_AIFC) May 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి