సినీతారల వ్యక్తిగత విషయాలు.. చిన్ననాటి ఫోటోస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతిసారి తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి నెట్టింట సెర్చింగ్ చేస్తుంటారు. అటు సెలబ్రెటీలు కూడా తమకు ఇష్టమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటీనటుల చైల్డ్ హుడ్ ఫోటోస్, సినిమా అప్డేట్స్ తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు ఆ అమ్మాయి టాలీవుడ్ సెన్సెషన్. ఎంతోమంది హృదయాలను దోచేసిన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. కేవలం కథానాయికగానే కాకుండా.. అటు క్లాసికల్ డ్యాన్సర్గానూ రాణిస్తోంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే సీనియర్ హీరోయిన్ శోభన. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
శోభన.. 1986లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శోభన. ఆ తర్వాత విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, మెగాస్టార్ చిరంజీవితో రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లో కళార్పణ అనే సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఎంతోమందికి భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది శోభన.
1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మలయాళ సినిమాకుగానూ భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. 2001లో నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గానూ రెండవ సారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.