AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా అటు హిందీలో.. ఇటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఇటీవలే ఆమె నటించిన ఓ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి తన నటనతో మెప్పించింది.

Tollywood: నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Rajitha Chanti
| Edited By: |

Updated on: Mar 03, 2024 | 10:30 PM

Share

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ అందాల తార. చీరకట్టులో ఎంతో సంప్రదాయ లుక్‏లో కనిపిస్తూనే..తన అద్భుతమైన నటనతో అడియన్స్ మనసులు దోచేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా అటు హిందీలో.. ఇటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఇటీవలే ఆమె నటించిన ఓ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి తన నటనతో మెప్పించింది. తను మరెవరో కాదు.. టాలీవుడ్ సీతామహాలక్ష్మి.. యూత్ గుండెల్లో అలజడి సృష్టించిన యష్ణ.. తనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ నిశిధీ యువరాణి ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మృణాల్ ఠాకూర్.. ముందుగా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. కుంకుమ్ భాగ్య్ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. అప్పట్లో ఈ సీరియల్ తెలుగులోనూ డబ్ అయ్యింది. ఆ తర్వాత కథానాయికగా బీటౌన్‏లోకి ఎంట్రీ ఇచ్చింది. హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో కథానాయికగా కనిపించి మెప్పించింది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇటు మృణాల్ క్రేజ్ సైతం పెరిగిపోయింది.

ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మృణాల్.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ మూవీలో యష్ణ పాత్రలో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!